తానూరు మండల పరిధిలో పోలీసులమని చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడి అరెస్టు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
తానూర్ పరిధిలో పోలీసులమని చెప్పుకొని డబ్బులు వసూలు చేసే ఘటనలో నిందితుడు పున్నోల్లా ప్రకాష్‌ను గుర్తించి అదుపులోకి తీసుకుని జ్యూడీషియల్ రిమాండ్‌కు పంపించడమైనది.
కేసు వివరాలు : స్థలం: తానూర్ పోలీస్ స్టేషన్ భైంసా నుండి కొలూర్ వైపు వెళ్తున్న సమయంలో ఫిర్యాదుదారు గంగాధర్ పార్వతోల్లా , బోల్సా గ్రామం సమీపంలో ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్‌పై అక్రమంగా వెంటాడుతూ అడ్డగించి మేము పోలీస్ వాళ్ళము అని బెదిరించారు. అనంతరం “చంపేస్తామని” ప్రాణహానీ బెదిరింపులు చేసి డబ్బులు దోచుకుని అక్కడి నుండి పరారయ్యారు.ఈ ఘటనపై ఫిర్యాదుదారు గంగాధర్ పార్వతోల్లా తానూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది. సీసీటీవీ ఫుటేజ్ మరియు సాంకేతిక ఆధారాల ఆధారంగా పల్సర్ బైక్‌ను గుర్తించి ఇద్దరు నిందితులను గుర్తించాం. అందులో ఒకరు పున్నోల్లా ప్రకాష్, నివాసం తానూర్ అని గుర్తించి సాంకేతిక ఆధారాల సహాయంతో అదుపులోకి తీసుకున్నాం. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా అతని కోసం గాలింపు కొనసాగుతోంది.
నిర్మల్ ఎస్పీ శ్రీమతి జనకీ షర్మిళ మేడమ్ ఆదేశాల మేరకు, నర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్ పర్యవేక్షణలో, ముదోల్ సీఐ రవీందర్ నాయక్ , మార్గదర్శకత్వంలో, తానూర్ ఎస్సై షేక్ జుబేర్ మరియు సిబ్బంది నిందితుణ్ణి పట్టుకున్నారు. పోలీసుల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరించడం, మోసం చేయడం చేసిన పక్షంలో కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు వెంటనే మానుకోవాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే తానూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగలరు.