తిమ్మాజి పల్లి తండా లో సోలార్ లైట్ల ఏర్పాటు

August 19, 2026 | సినిమా వార్తలు

రాయికల్ టోల్ ప్లాజా వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు

టోల్ ప్లాజా యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన తండా సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్

( పయనించే సూర్యుడు ఆగస్టు 20 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )( షాద్ నగర్ ) షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం పరిధిలోని కడియాలకుంట తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మాజిపల్లి తాండా, బూరుగడ్డ తాండా మరియు కడియాలకుంట తాండాలో రాయికల్ టోల్ ప్లాజా వారి సహకారంతో సోలార్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది.గ్రామ ప్రజల భద్రత, రాత్రి వేళల్లో మెరుగైన వెలుతురు మరియు ప్రజలకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో, గ్రామ సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ అభ్యర్థన మేరకు ఈ సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కడియాలకుంట తాండా గ్రామ పంచాయతీ మరియు గ్రామ ప్రజల తరఫున రాయికల్ టోల్ ప్లాజా యాజమాన్యానికి సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.గ్రామ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమానికి సహకరిస్తున్న రాయికల్ టోల్ ప్లాజా వారి సేవలను గ్రామ పంచాయతీ తరఫున అభినందించారు. రాజు నాయక్ చౌహాన్ సర్పంచ్ కడియాలకుంట తాండా గ్రామ పంచాయతీ

🌐 Select Language:
📰 ePaper