తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం ‘మహా పాపం’.. వైసీపీ నేతలది క్షమించరాని నేరం: కరెడ్ల దేవి
పయ నించే సూర్యుడు జనవరి 30 ప్రతినిధి
[ శ్రీవారి ప్రసాదం 22 కోట్ల లడ్డూ లను కల్తీ చేసిన కుట్రలో, పరకామని దొంగతనం కేసులో కీలకమైన సూత్రధారులు ని వెంటనే అరెస్ట్ చేయాలని, 150 కోట్ల మంది భక్తులు మనోభావాలను దెబ్బ తీసిన హిందూద్రోహి జగన్ అని ఏపీ బిజెపి స్టేట్ నాయకురాలు కరెడ్ల దేవి పేర్కొన్నారు నిజం నిప్పులాంటిది:
“లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆధారాలతో సహా బయటపడుతుంటే, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దేవుడి దగ్గర ప్రమాణాలు చేయడం సిగ్గుచేటు. మీరు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా చేసిన పాపం పోదు. చంద్రబాబు నాయుడు వాస్తవాలు బయటపెడితే తట్టుకోలేక వైసీపీ నేతలు గిలగిలలాడుతున్నారు” అని మండిపడ్డారు.
నాటకాలు కట్టిపెట్టండి:భక్తుల మనోభావాలతో ఆడుకున్న వైసీపీ నేతలకు ఆ వెంకన్నే తగిన శిక్ష వేశారని, ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని, లేకపోతే భవిష్యత్తులో రాజకీయంగా అడ్రస్ లేకుండా పోతారని దేవి హెచ్చరించారు.జగన్ గ్యాంగ్ సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ లు భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మరెడ్డి లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా యెందుకు అరెస్ట్ చేయలేదు అని ప్రశ్నించారు.