తెలంగాణ జలసిరి అంశంపై పడంపల్లి గ్రామంలో ప్రత్యేక గ్రామసభ

July 31, 2026 | ఆంధ్రప్రదేశ్

జుక్కల్ జులై 30 న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పడంపల్లి గ్రామపంచాయతీలో జలసిరి పథకం పైన సర్పంచ్ వాగు మారే విజయ కుమారి సంజీవ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది ఇట్టి గ్రామసభ యందు గ్రామంలో వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని వర్షపు నీటిని వృధా చేయకుండా ప్రతి ఇంటిని ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని మరియు రైతులు ఫాంపౌంట్స్ నిర్మించుకోవాలని మరియు గ్రామంలో ఉన్న గ్రామపంచాయతీ అన్ని బోర్లకు బోర్వెల్ రీఛార్జ్ పాయింట్ నిర్మించాలని మరియు నీటిని పొదుపుగా వాడాలని సూచించడం జరిగింది మరియు వర్షాకాలంలో రాబోయే సీజనల్ వ్యాధుల పైన అవగాహన కల్పించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ ప్రజలకు ఎటువంటి గ్రామసభ యందు సర్పంచి గారు కోరడం జరిగింది మరియు గ్రామపంచాయతీ నుండి సీజనల్ వ్యాధులు రాకుండా అనేక రకాల చర్యలు చేయబడుతున్నట్లు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామస్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది.

Geographic Reference

🌐 Select Language:
📰 ePaper