PS Telugu News
Epaper

తెలంగాణ రాష్ట్ర ఓబిసి విభాగం చైర్మన్ గా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రమాణ స్వీకారం

📅 23 Mar 2026 ⏱️ 6:37 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

శుభాకాంక్షలు తెలిపిన కేశంపేట్ మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి

( పయనించే సూర్యుడు మార్చి 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం చైర్మన్‌గా నియమితులైన షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా కలుసుకున్న కేశంపేట మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గాంధీభవన్ లో ఆయనను కలుసుకుని శాలువాతో సన్మానించి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీకి, ముఖ్యంగా ఓబీసీ వర్గాల అభివృద్ధికి శంకర్ నాయకత్వం ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో ఆయనకు ఉన్న అనుభవం, కృషి ఈ కొత్త బాధ్యతలో మరింత ప్రతిఫలిస్తుందని తెలిపారు.అలాగే, శంకర్ ఈ పదవిలో విజయవంతంగా పనిచేసి పార్టీకి, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు..

Scroll to Top