విజన్ విద్యాసంస్థలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 10, శర్మాష్ వలి, మండల రిపోర్టర్ యాడికి : స్థానిక విజన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా సంక్రాంతి సంబరాలు విజన్ విద్యార్థులు మరియు అతిధులు ఉపాధ్యాయుల సమక్షంలో జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా యాడికి పట్టణ సీఐ శ్రీనివాసులు విచ్చేసి సంక్రాంతి శోభను ఉట్టిపడేలా చేసిన కార్యక్రమాలను వీక్షించి విద్యార్థులకు విలువైన సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థులు వేసిన రంగవల్లులను పరిశీలించి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది […]




