అన్నారంలో నాల్గవ రోజు కొనసాగిన ఎన్.ఎస్.ఎస్. సేవా కార్యక్రమాలు
(పయనించే సూర్యుడు జనవరి 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) యూనిట్-1 విద్యార్థులు శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా నాలుగవ రోజు అన్నారం గ్రామం సమీపంలోని కొండయగడ్డ తండాలోని వీధుల్లో పరిశుభ్రత-పచ్చదనంపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తండాలోని ప్రాథమిక పాఠశాల పరిసరాలను, తండా వీధులను చెత్త, చెదారం లేకుండా ఊడ్చి శుభ్రం చేశారు. తర్వాత తండాలోను, అన్నారం గ్రామ […]




