మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 27(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ అధికారి చిగురుపాటి శ్రీనివాసులు పేర్కొన్నారు.స్వస్ నారి స శక్తి పరివార్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర్ ,డాక్టర్ సాయి సుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మండలంలోని నిట్టూరు గ్రామ సచివాలయంలో ప్రజలకు ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేశారు. […]




