నూతన సంవత్సర కానుకగా వసతి గృహ విద్యార్థులకు ‘ముస్తాబు కిట్లు’: జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పయనించే సూర్యుడు డిసెంబర్ 30,నంద్యాల జిల్లా, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాలోని 155 వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ‘ముస్తాబు కిట్లు’ అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ భవనంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను కలిసేందుకు వచ్చే జిల్లా అధికారులు ఎవరూ బొకేలు, కేకులు, శాలువలు […]




