దాతల సహకారంతో పాఠశాలకు అన్ని వసతులు కల్పిస్తున్న కశెట్టి. జగన్.
. జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 2 ఈరోజు
తర్లుపాడు మండలం జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలకు 15000 రూపాయలు విలువగల బీరువాను దాత నంద్యాల వాస్తవ్యులు శ్రీ పెరుమాళ్ళ. బాల మోహన్ రావు అందించారని ప్రధానోపాధ్యాయులు జగన్ తెలియజేశారు. పాఠశాలలో రికార్డులు భద్ర పరచుకొనుటకు సరైన వసతి లేదని దాతను కోరగా వెంటనే 15 వేల రూపాయలు విలువగల బీరువాను స్కూలుకి అందించి తన మంచి మనసును చాటుకున్నారు అని జగన్ తెలియజేశారు. ఈ సందర్భంగా దాత బాల మోహన్ రావు మాట్లాడుతూ జగన్ నిరంతరము సమాజం కోసం పాటుపడే విధానం మనసుకు నచ్చి నా వంతుగా నేను సహకారం అందించానని ఈ సందర్భంగా తెలియజేశారు. జగన్ ఒక్క పాఠశాలకే పరిమితం కాదు మండలంలో ఉన్న 360 మంది 10 వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించడం, ఎగ్జామ్ పాడ్స్ పంచడం, అలాగే హిందూ స్మశాన వాటిక అభివృద్ధి చేయడం, రోడ్డు మార్గంలో ఇరువైపుల చిల్లకంపను తొలగించడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉంటాడు. జగన్ మాకంటే వయస్సులో చిన్నవాడైనా అతను చేసే పనులు ఆదర్శవంతంగా ఉంటాయి అని బాల మోహన్ రావు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని అలవర్చుకోవాలని తెలియజేశారు . ఈ సందర్భంగా దాత విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని అనూష గారు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
