దుర్వాసనలో చదువులమ్మ సర్కారు బడి
పయనించే సూర్యుడు మార్చి 24 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు)
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల ముఖ ద్వారం వద్ద ఒక పెద్ద డ్రైనేజీ కాలువ పొంగిపొర్లుతున్న పట్టించుకోని స్కూల్ ప్రిన్సిపాల్ మేడం? పాఠశాల ఆవరణలో కూడా అదే దుస్థితి రాష్ట్రవిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలని తీర్చిదిద్దాలని సంకల్పంతో ముందుకు వెళుతున్నారు కానీ ఈ పాఠశాల ముందున్న మురికి కాలువ నుండి దుర్వాసన రాకుండా తీర్చి దిద్దులేని స్థితిలో ఉన్న మున్సిపాలిటీ అధికార యంత్రాంగం మరియు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ చూసి చూడనట్లు మనకెందుకులే అని వెళుతున్నట్టున్నారు ! మన పిల్లలు ఇక్కడ చదువలేదు కదా మనకెందుకులే అని ప్రిన్సిపల్ వ్యవహార శైలి ఉంది. ఇకనైనా ఆలోచించాలి. అధికారులు పిల్లలకి మంచి ఆహారం మంచి వాతావరణం అందిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు కూడా ఉన్నత శిఖరాలకు చేరుతారు. అధికారులు స్పందించి స్కూలు ముందున్న డ్రైనేజీ కాలువను క్లీన్ చేసి పిల్లలకు మంచి వాతావరణం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు కోరుకుంటున్నారు
