దేవుళ్ళ గుడిలో దొంగల బీభత్సవం
కడియాల కుంట తండా లోని రెండు గుళ్లో హుండీలు చోరీ
కడియాల కుంట తండా సేవాలాల్ మహారాజ్ మరియు బూరుగడ్డ తండా ఆంజనేయ స్వామి హుండీలు చోరీ
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తండా ప్రజలు
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని సేవాలాల్ మహారాజ్ గుడిలో మరియు బూరుగడ్డ తండా ఆంజనేయ స్వామి గుడిలో గత రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. బంజారాలారా ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ గుడిలో గత కొన్ని రోజుల క్రితమే నూతనంగా హుండీ నీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతలోనే దొంగలు దోచుకుపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బూరుగడ్డ తండాలోని ఆంజనేయస్వామి గుడిలోని హుండీ నీ సైతం దొంగలు ఎత్తుకెళ్లడం జరిగింది. ఆంజనేయ స్వామి గుడిలోని హుండిని ఎత్తుకెళ్లి సమీపంలోని వ్యవసాయ పొలంలో పగలగొట్టి కానుకలను ఎత్తుకుపోవడం జరిగింది.దీంతో తండా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తండ పరిధిలోని రెండు గుళ్లో ఒకేరోజు చోరీ జరగడంతో తాండ ప్రజలు మరియు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
