PS Telugu News
Epaper

దేశ పరువు తీసేలా కాంగ్రెస్ నిరసనలు: అల్లూరి పద్మ విమర్శ

📅 24 Feb 2026 ⏱️ 7:32 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించు సూర్యుడు ఫిబ్రవరి 24 ముమ్మిడివరం గ్రంధి నానాజీ

ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నాయకుల నిరసన తీరుపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లూరి పద్మ వర్మ మండిపడ్డారు. సోమవారం ఆమె పాలకొల్లులో మాట్లాడారు. 80 దేశాల ప్రతినిధులు పాల్గొన్న సదస్సులో అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం దేశ ప్రతిష్ఠను దిగజార్చడమేనని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అంతర్జాతీయ వేదికలపై దేశ పరువు తీయడం సరికాదని ఆమె హితవు పలికారు.

Scroll to Top