దొంచంద గుమ్మిర్యాల అక్రమముగా నిలువ చేసిన ఇసుక డంపులను సీజ్ చేసిన ఎంఆర్ఓ ఎస్ ఐ ఆర్ ఐ
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
బాల్కొండ నియోజకవర్గం లో ఎరుగట్ల మండల కేంద్రంలో దోంచందా గ్రామంలో గుమ్మిర్యాల గ్రామములో ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమముగా నిలువ చేసిన గుమ్మిర్యాల(6) దోమ చంద 17 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపును గుర్తించి పొలిసు, రెవిన్యూ పంచాయతి సిబ్బంది కలిసి సీజ్ చేయడము జరిగినది. ఇట్టి ఇసుకను ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు పంపిణి చేయబడును. మొత్తము (23) ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక సీజ్ చేయడము జరిగినది.మండలములో ఎవరైనా ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమముగా ఇసుకను రవాణా చేసినట్లు అయితే ఇసుక వాహనములు సీజ్ చేసి, వాహనముల పైన, వాహన యజమానుల పైన, డ్రైవర్ ల పైన ఇసుకను డంపులు చేసి ఇతర ప్రాంతాలకు తరలించు వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయబడును.ఏర్గట్ల మండలములో బట్టాపూర్, తుర్తి (2) గ్రామాలలో ప్రభుత్వము వారిచే ఆన్లైన్ ద్వారా ఇసుకను సరఫరా చేయుచున్నాము. ప్రజలు అనగా ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు, ప్రైవేటు ఇండ్లు కట్టుకుంటున్న వారికి మరియు ప్రభుత్వ పనులు చేయుచున్నకాంట్రాక్టర్లకు వారికి ఆన్లైన్ లో ఇసుక గురించి నమోదు చేసుకుంటే ఇసుకను ప్రభుత్వము వారిచే తక్కువ ధరలకు సరఫరా చేయుచున్నాము. మండలములోని ప్రజలు కాంట్రాక్టర్లు మధ్యవర్తులను ఆశ్రయించి ఎక్కువ దరలకు ఇసుకను తీసుకోకూడదు అని, ఆన్లైన్ లో ప్రభుత్వము వారి ఆన్లైన్ విధానము ద్వారా తక్కువ ధరకు ఇసుకను తీసుకోవలసినడిగా తెలియజేయనైనది.
