ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ఏన్కూర్ మండలంలో పలు గ్రామాల్లో సిసి రోడ్లు ప్రారంభించడం జరిగింది
పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు మహర్దశ కలిగిందని రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు మహర్దశ కలిగిందని రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ అన్నారు. ఏన్కూరు మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రైతు సమస్యలు పట్టించుకోకుండా కాలం గడిపారని, సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ పాలన గుర్తుంచుకునే విధంగా ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం జరిగే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైరా నియోజకవర్గంలో రైతులు సస్యశ్యామలం అయ్యేవిధంగా ప్రతి పంటకు సాగునీరు అందించే విధంగా సీతారామ ప్రాజెక్టును వైరా రిజర్వాయర్‌కు అనుసంధానం చేసే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు. ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని న్యాయం జరిగిందని, ఇందిరమ్మ రాజ్యం కోసం ఎదురుచూసిన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం కృతనిత్యంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శేషగిరిరావు, ఎంపీడీవో రమేష్, ఎంపీఈఓ జీవీఎస్ నారాయణ, గార్లఒడ్డు సొసైటీ అధ్యక్షుడు, శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్, లచ్చిరాం నాయక్, మేడ ధర్మారావు, స్వర్ణ నరేందర్, ప్రభావతి రెడ్డి, ఏపీఎం, శ్యామ్ కుమార్. ఏవో నరసింహారావు. తదితరులు పాల్గొన్నారు.
