నంద్యాలలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలు
పయనించే సూర్యుడు నవంబర్ 28,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
మహాత్మ పూలే ఆశయాల సాధనకై కృషి చేస్తాం : టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్
నంద్యాలజిల్లా, సామాజిక సంస్కరణోద్యమ పితామహుడు, మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో శుక్రవారం పద్మావతి నగర్ ఆర్చి దగ్గర ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ… “బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విద్య అందించడం కోసం, ముఖ్యంగా మహిళా విద్య కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు ఈ తరానికి, భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయం అన్నారు . కుల వ్యవస్థను, సాంఘిక అసమానతలను రూపుమాపడానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని” కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, మహాత్మ పూలే ఆశయాల సాధననే యువత లక్ష్యంగా పెట్టుకోవాలని ఎన్ఎండి ఫయాజ్ పిలుపునిచ్చారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని పూలే ప్రగాఢంగా నమ్మారని, ఆయన స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి ప్రసాద్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు , చల్లా గోపాల్ యాదవ్, గోవిందు నాయుడు, కామిని మల్లికార్జున, మధు సాయి , దీపక్ , అక్బర్, షాకీర్, బేగ్, ఓబులేష్ మరియు టిడిపి నాయకులు, బీసీ సామాజిక వర్గాల ప్రముఖులు పాల్గొని పూలే సేవలను స్మరించుకున్నారు.
