నంద్యాల పార్లమెంట్ ప్రజలకు ఎంపీ నిధులతో ఉచిత మినరల్ వాటర్ అందించాలనే లక్ష్యం.”
పయనించే సూర్యుడు డిసెంబర్ 26,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
ఆర్ టీ సి ప్రయాణికులకు, కార్మికులకు ఉచిత మినరల్ వాటర్.
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల పార్లమెంట్ పరిధిలో అవసరం ఉన్న చోట అన్ని గ్రామాల్లో ఎంపీ నిధులతో మినరల్ వాటర్ ఫ్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధిచేసిన మంచినీరు ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నానని, ఆర్ టీ సి బస్టాండ్ లో ప్రయాణికులు ఎక్కువ డబ్బులు పెట్టి వాటర్ బాటిల్లు కొని మంచి నీరు తాగుతున్నది చూసి, ప్రయాణికుల విన్నపం, ఆర్ టీ సి కార్మికులు అభ్యర్థన మేరకు నంద్యాల ఆర్ టీ సి బస్టాండ్ ఆవరణలో తన ఎంపీ నిధులు రూ. 9 లక్షలతో నూతనంగా మినరల్ వాటర్ ఫ్లాంట్ నిర్మించి శుద్ధిచేసిన మంచి నీరు ఉచితంగా అందించడం ఎంతో ఆనందంగా ఉందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.శుక్రవారం నంద్యాల ఆర్ టీ సి బస్టాండ్ ఆవరణలో రూ. 9 లక్షల ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన మినరల్ వాటర్ ఫాంట్ ను నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, ఆర్ టీ సి, డి పి టీ సి రజియా సుల్తానా, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, మార్క్ ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి లతో కలిసి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ 60 శాతం రోగాలు మంచినీటితో దూరం చేయవచ్చు అన్నారు. కలుషిత నీరు రోగాలకు కారణమని, అందువల్ల నంద్యాల జిల్లా ప్రజలకు తన ఎంపీ నిధులు ఎక్కువ కేటాయించి మినరల్ వాటర్ ఫ్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధి చేసిన నీరు అందిస్తామన్నారు. ఎక్కడైనా మినరల్ వాటర్ ఫ్లాంట్ అవసరం అనుకున్నవారు తనను కలిసి మంచి నీటి సమస్యకు పరిష్కారం చేద్దామని జిల్లా ప్రజలను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. ఆర్ టీ సి ఉద్యోగులు, కార్మిక సంఘం నాయకులు, ఆర్టీసీ పారిశుధ్య కార్మికులు వారి సమస్యలపై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి వినతి పత్రాలు అందించారు.ఈ కార్యక్రమంలో ఆర్ టీ సి డిపో మేనేజర్ జె. వి. మాధవిలత, ఆర్ డబ్యూ ఎస్ డి ఆర్ ఈ ఓ, ఈ. శ్రీనివాసులు, డి ఈ ఈ శివ మోహన్, ట్రాఫిక్ సి ఐ చాన్ బాషా, సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి డాక్టర్. కాకరవాడ చిన్న వెంకటస్వామి, మినరల్ వాటర్ ప్లాంట్ల కాంట్రాక్టర్ జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
