నంద్యాల బిషప్ బంగ్లాలో ఘనంగా క్రిస్మస్ ఆత్మీయ విందు-ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఎన్ఎండి ఫరూక్
పయనించే సూర్యుడు డిసెంబర్ 27,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నంద్యాల డయాసిస్ బిషప్ కామనూరి సంతోష్ ప్రసన్న రావు దంపతులు స్థానిక బిషప్ బంగ్లాలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు కార్యక్రమం శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బిషప్ బంగ్లాకు చేరుకున్న మంత్రి ఫరూక్ కు బిషప్ సంతోష్ ప్రసన్న రావు దంపతులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల ప్రాంతం మొదటి నుండి మత సామరస్యానికి పెట్టింది పేరు అని,ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు పండుగ ఏదైనా కలిసి జరుపుకోవడం మన గొప్ప సాంప్రదాయమన్నారు . బిషప్ ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ విందులో నేను పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. నంద్యాల జిల్లాలో క్రైస్తవ సంస్థలు విద్యా మరియు వైద్య రంగాల్లో అద్భుతమైన సేవలు అందిస్తున్నాయని,ఎంతో మంది నిరుపేదలు ఈ సంస్థల ద్వారా ఉన్నత చదువులు చదువుకుని సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నారన్నారు. ముఖ్యంగా నంద్యాల డయాసిస్ బిషప్ సంతోష్ ప్రసన్న రావు, నాయకత్వంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు నిజంగా గర్వకారణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్స్ సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ముఖ్యమంత్రి, ఆదేశానుసారం క్రైస్తవ సోదరుల సమస్యల పరిష్కారానికి, చర్చిల మరమ్మతులకు, క్రిస్మస్ కానుకల పంపిణీకి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. క్రిస్టియన్స్ విద్యార్థుల కోసం ఉన్నత విద్యా పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగ ప్రేమ, కరుణ మరియు క్షమకు ప్రతీక అని. ఆయన బోధనలు పాటించడం ద్వారానే ప్రపంచంలో శాంతి నెలకొంటుందన్నారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు చూపిన సేవా మార్గంలో నడవాలని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు.అనంతరం మంత్రి గారిని బిషప్ దంపతులు శాలువా కప్పి , పుష్పగుచ్ఛం మరియు జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నంద్యాల బిషప్ సంతోష్ ప్రసన్న రావు మాట్లాడుతూ లోకరక్షకుడు యేసుక్రీస్తు భూమిపైకి శాంతి దూతగా విచ్చేశారని, ఆయన చూపిన ప్రేమ మార్గం నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరూ సోదరభావంతో మెలగాలన్నదే క్రిస్మస్ ఉద్దేశమని చెప్పారు. నంద్యాల డయాసిస్ పరిధిలో ఆధ్యాత్మిక సేవలతో పాటు విద్యా, వైద్య రంగాలలో నిరుపేదలకు నాణ్యమైన సేవలు అందించడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని బిషప్ వివరించారు. ఈ ఆత్మీయ విందుకు విచ్చేసిన మంత్రి ఫరూక్ కి, ఇతర ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) జనార్దన్ రెడ్డి, ఉర్దూ డీఐ అస్ముద్దీన్, ఒకటో పట్టణ సీఐ సుధాకర్ రెడ్డి, సెక్రటరీ ప్రభుదాస్ , మాజీ కౌన్సిలర్ కృపాకర్, 33వ వార్డు టిడిపి ఇంచార్జి జోసఫ్ , జార్జ్, శరత్ మరియు పలువురు క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు ప్రముఖులు ఈ ఆత్మీయ విందులో పాల్గొన్నారు.
