PS Telugu News
Epaper

నాణ్యత, నమ్మకానికి చిరునామా ఆన్సర్ జ్యువెలర్స్ : మంత్రి ఎన్ఎండి ఫరూక్””

📅 13 Oct 2025 ⏱️ 2:22 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 12, నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్,నంద్యాల స్థానిక సౌజన్య ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఆన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీస్ మెగా ఎగ్జిబిషన్ ను ఆదివారం సందర్శించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల లాంటి ప్రాంతంలో ఇంత పెద్ద స్థాయిలో, అత్యాధునిక డిజైన్లతో ఆభరణాల ప్రదర్శన ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు. “అన్సర్ జ్యువెలర్స్ ఎల్లప్పుడూ నాణ్యతతో కూడిన, నమ్మకమైన బంగారాన్ని, డైమండ్స్ ను వినియోగదారులకు అందిస్తుందని,మార్కెట్‌లో పోల్చుకుంటే అతి సరసమైన ధరలకే అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బంగారు ఆభరణాలను అందించడం ఆన్సర్ జ్యువెలర్స్ యొక్క ప్రత్యేకత అన్నారు . ప్రస్తుతం వెడ్డింగ్ సీజన్ దృష్ట్యా కొత్త కొత్త డిజైన్లను, వెరైటీ ఆభరణాలను తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా, వజ్రాభరణాలలో అద్భుతమైన కలెక్షన్స్ ఉన్నాయని, నంద్యాల మరియు చుట్టుపక్కల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఇక్కడ ఏర్పాటు చేసిన సరికొత్త ఆఫర్లతో కూడిన డిజైన్స్ ను సందర్శించాలని, కొనుగోలు చేయాలని మంత్రి ఫరూక్ కోరారు. ఆన్సర్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ సేల్ లో ప్రత్యేక రాయితీలు, డిస్కౌంట్లు కూడా ఉన్నాయని తెలిపారు.
Scroll to Top