PS Telugu News
Epaper

నాలుగు లక్షల లంచం తీసుకొని.. డ్రంక్అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిపై కేసు కాకుండా తప్పించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు

📅 21 Oct 2025 ⏱️ 2:13 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; వరంగల్ జిల్లాకి చెందిన ఎమ్మెల్యే కొడుకుగా ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణలో వెల్లడి గతంలో పోలీసు శాఖలో పనిచేసిన సదరు ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం హనుమకొండలో మద్యం మత్తులో కారు నడుపుతున్న వ్యక్తిని కాకుండా పక్క సీట్లో ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని బెదిరించి రూ.లక్ష వసూలు వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఓ ఎస్సై వారం రోజుల క్రితం వాహనాలు తనిఖీ చేసే సమయంలో మద్యం సేవించి కారులో వెళ్తూ పట్టుబడ్డ ఐనవోలు మండలానికి చెందిన ఇద్దరు యువకులు ఆ ఇద్దరినీ ఎస్సై పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లిన కొద్ది సేపటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు పోలీసులకు ఫోన్ చేసి డ్రైవింగ్ చేసిన యువకుడిని వదిలిపెట్టాలని సూచించడంతో కొద్దిసేపటికే పంపించేసిన పోలీసులు అయితే పక్క సీట్లో కూర్చున్న యువకుడిని మాత్రం రోజంతా పోలీసుస్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేసిన ఎస్సై బాధిత యువకుడు బంగారు గొలుసు కుదవబెట్టి పోలీసు స్టేషన్‌లో రూ.లక్ష ఇచ్చినప్పటికీ.. మరోసారి బాధిత యువకుడి వద్ద 8 గ్రాములు గంజాయి దొరికినట్టు కేసు నమోదు చేసిన ఎస్సై కారు నడుపుతున్న యువకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై.. మరింత లోతుగా విచారించి.. డ్రైవింగ్ సీటు పక్కన కూర్చున్న యువకుడిని పోలీసులు కొట్టడం, రూ.లక్ష వసూలు చేసి గంజాయి కేసు పెట్టడం నిజమేనని తేల్చిన ఇంటెలిజెన్స్ పోలీసులు మద్యం తాగి కారు నడిపిన వ్యక్తిపై కేసు కాకుండా చూసేందుకు రూ.4 లక్షలు లంచం తీసుకుని అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు తప్పించాడని గుర్తించిన ఇంటెలిజెన్స్ పోలీసులు అయితే పోలీసు దెబ్బలతో బాధిత యువకుడి ఆరోగ్యం దెబ్బ తినగా చికిత్స నిమిత్తం వరంగల్ దవాఖానలో చేర్పించి.. ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబం.

Scroll to Top