PS Telugu News
Epaper

నిజామాబాద్ లో పిబ్రవరి01 నాడు జరిగే కామ్రేడ్ కె యాదగిరి ప్రథమ వర్ధంతిని జయప్రదం చేయండి

📅 28 Jan 2026 ⏱️ 2:10 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్

సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ ఆదర్శ కమ్యూనిస్ట్ యోధుడు కామ్రేడ్ కర్నాటి యాదగిరి అని అయన మార్గం అందరికి ఆచరణీయం అని సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ పేర్కొన్నారు పిబ్రవరి 1నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రథమ వర్ధంతి సభ పోస్టర్స్ ను బుధవారం నాడు సిరికొండ మండలం లోని గడ్కోల్ లో ఆవిష్కరించారు.ఈ సందర్బంగా సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతు: కామ్రేడ్ కె యాదగిరి విప్లవవోధ్యమాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు అన్నారు. ఉద్యమం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టిన గొప్ప త్యాగదనుడు అన్నారు. జీవితాంతం విప్లవోది మల్ల వ్యాప్తి కోసం అంకిత భావంతో, నిజాయితీగా నికార్సుగా పనిచేసిన ఆ విప్లవ ధన్యజీవి కామ్రేడ్ కర్నాటి యాదగిరి అని అన్నారు. ముఖ్యంగా సిరికొండ మండల విప్లవోద్యమానికి అమరుడు కామ్రేడ్ కర్నాటి యాదగిరికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. తన విప్లవోద్యమ కాలంలో సగ జీవితం సిరికొండ ఉద్యమంకు ధారబోసిన మార్గదర్శి అన్నారు. కామ్రేడ్ కర్నాటి యాదగిరి నిడారంబరంగా, త్యాగపూరితమైన జీవితం గడిపారన్నారు. పోలీసులచే చిత్రహింసలు అరెస్టులు చేయబడ్డ చలించని గుండె నిబ్బరం కలిగిన వాడున్నారు. కామ్రేడ్ కర్నాటి యాదగిరి ని స్కరించుకోవడం అంటే విప్లవోద్యమంలో మనము కార్యదర్శిలుగా మమేకమై ఆయన ఆశయాలను ముందుకు తీసుకపోవడమేనని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, జిల్లా నాయకుడు ఆ రమేష్,ఎస్ సురేష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి బాబన్న, బి కిషన్, ఎం సాయి రెడ్డి, ఎం లింబాద్రి,మండల నాయకులుపి రమ,బి కిశోర్, ఇ రమేష్,జి రాంజీ, జె బాల్ రెడ్డి, జి బాబురావు,పి ఎల్లయ్య, జె ఎర్రన్న,జె రాజు, ఎస్ గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top