PS Telugu News
Epaper

నిమ్స్ ఆసుపత్రిలో రవీందర్‌ను పరామర్శించినటీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ

📅 27 Nov 2025 ⏱️ 6:39 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలి వెలుగుల చక్రపాణి

యూనియన్ తరఫున పూర్తి అండగా ఉంటామని భరోసా

త్వరగా కోలుకుని తిరిగి విధుల్లో చేరాలని ఆకాంక్ష

నిర్మల్

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ మోకాలి చిప్ప శస్త్రచికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కే. విరాహత్ అలీ, గురువారం సాయంత్రం ఆసుపత్రిని సందర్శించి రవీందర్‌ను పరామర్శించారు.
రవీందర్ ఆరోగ్య పరిస్థితి, శస్త్రచికిత్స వివరాల గురించి ఆసుపత్రి వైద్యులను, సిబ్బందిని విరాహత్ అలీ అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లాలో సీనియర్ జర్నలిస్టుగా, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా రవీందర్ పాత్ర, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా విరాహత్ అలీ కొనియాడారు. ఆపరేషన్ అనంతర చికిత్స, తదుపరి రికవరీకి ఎలాంటి అవసరమున్నా, ఆర్థిక సహాయం లేదా ఇతర ఆసుపత్రి సంబంధిత అవసరాలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని రవీందర్‌కు ఆయన సూచించారు. యూనియన్ తరఫున అన్ని విధాలా అండగా ఉంటూ, సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ, టీయూడబ్ల్యూజే తమ సభ్యులకు ఆరోగ్య పరమైన ఆపద సమయాల్లో తోడుగా నిలబడాలనే లక్ష్యంతో పనిచేస్తుందని, జర్నలిస్టుల ఆరోగ్య సంక్షేమానికి యూనియన్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రవీందర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరాలని ఆకాంక్షించారు.ఈ పరామర్శ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు, హైదరాబాద్ స్థానిక జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top