PS Telugu News
Epaper

నిరుపేద కుటుంబానికి భరోసాగా…. నిలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి రూ 4 లక్షల ఎల్ ఓ సి అందజేత

📅 06 Mar 2026 ⏱️ 6:48 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్:(పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి )మార్చ్ 06

అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదరాలికి బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన కుర్లేం గంగమణి గత కొద్దికాలంగా గుండె సంబంధిత వ్యాధి తో బాధ పడుతుంది. ఆ కుటుంబం నిరుపేదది కావడంతో స్థానిక నాయకులు మాజీ విండో చైర్మన్ పత్తి రాముకి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలుపగా వెంటనే స్పందించి . ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి నిరుపేద కుటుంబానికి భరోసా ఉండాలన్న మానవత దృక్పథంతో గుండె శస్త్ర చికిత్స కోసం రూ 4 లక్షల రూపాయల ఎల్ ఓ సి ని నిరుపేద కుటుంబానికి అందించారు. గుండె శస్త్ర చికిత్స కోసం ఎల్ ఓ సి నిరుపేద కుటుంబానికి అందించామని స్థానిక నాయకులు పత్తి రాము తెలిపారు.నిరుపేదలకు అండగా నిలుస్తున్న శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి పత్తి రాము తో పాటు కుర్లెం గంగమణి మరియు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు

Scroll to Top