నిర్మల్ జిల్లా*నిర్మల్ పోలీస్…మీ పోలీస్
భైంసా మున్సిపాలిటీలో చైర్మన్–వైస్ చైర్మన్ ఎన్నికలకు జిల్లా ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణ
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
రాజ్యాంగబద్ధ ప్రక్రియకు కట్టుదిట్టమైన పోలీస్ భద్రత**జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్*మూడు మున్సిపాలిటీలో ఈరోజు ప్రమాణస్వీకారాలు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో *జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్* భైంసా మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ క్రమంలో గెలుపొందిన వారందరూ ఈరోజు ప్రమాణస్వీకారం చేయనుండగా, అనంతరం చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించబడనుంది. ఈ పక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంతంగా సాగేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు అమలు చేయబడ్డాయి. ఇదే విధంగా జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో కూడా ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు *జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్* తెలిపారు. ప్రజలు ప్రలోభాలకు లోనుకాకుండా రాజ్యాంగబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించినట్లే, అభ్యర్థులు కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించినట్లు జిల్లా ఎస్పీ *డా.జి.జానకి షర్మిల ఐపీఎస్* స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్మన్–వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తయ్యేలా పోలీస్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తుందని తెలిపారు.
