నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ కు భైంసా పట్టణంలోని కమలాపూర్ గుట్ట వద్ద ఉన్న డంపు యాడు గురించి వినతి పత్రం
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
పట్టణంలో ని కమలాపూర్ గుట్టకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీకి సంబంధించిన డంప్యాడ్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సమస్య ఏమిటంటే భైంసా పట్టణంలో ని కమలాపూర్ గుట్టకు ఆనుకొని ఉన్న మునిసిపాలిటీకి సంబంధించిన డంప్యాడ్ దాని వలన అక్కడికి వెళ్లే రైతులకి అలాగే అక్కడ ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ దర్శనానికి వస్తున్న ప్రజలకి చాలా ఇబ్బంది గురవుతున్నారు వాటి చెత్త కాలుష్యము వలన క్యాన్సర్ కు గురి అవుతున్నారు అదే విధంగా రైతులకి పంట నష్టం జరుగుతుంది కావున మా యందు దయతలచి ఈ డంప్ యార్డ్ ను ఇక్కడి నుంచి వేరే స్థలంలో మార్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ గల్లి సర్పంచ్ రాజా లింగు , ఉప సర్పంచ్ దిపోల్ల సాయినాథ్ , అల్లకొండ సతీష్ , రావుల రాము, బాజనోల్ల ఈరయ్య, సాయినాథ్ పాటిల్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.