PS Telugu News
Epaper

నిర్మల్ జిల్లా పోలీస్..మీ పోలీస్*రాజీ మార్గమే రాజ మార్గం…

📅 20 Dec 2025 ⏱️ 1:50 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో

ఈ నెల 21 న జాతీయ లోక్ అదాలత్

జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు తక్షణ న్యాయం

కక్షిదారులు ఈరోజు, రేపు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ విజ్ఞప్తి

ఈరోజు, రేపు జరిగే జాతీయ లోక్ అదాలత్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడనుంది. ఈ సందర్భంగా కక్షిదారులు కోర్టు పరిధిలో ఉన్న వివిధ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. చాలా మంది ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన , తక్కువ ఖర్చుతో పరిష్కరించడానికి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగపరచుకోవాలని జిల్లా ఎస్పీ తెలపడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…

ఈరోజు, రేపు జరిగే.. జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలియ జేశారు.ఇందులో చిన్న చిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు , సివిల్ డిస్ప్యూట్లు వంటి వివాదాలు లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను తక్కువ సమయంలో ముగించుకోవచ్చన్నారు.అంతేకాకుండా, ఇది ఒక శాంతియుత పరిష్కార విధానం కావున, ఇరు పక్షాలు పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. కోర్టు లో గల కేసులలో త్వరగా పరిష్కారం చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు.

Scroll to Top