PS Telugu News
Epaper

నూతనంగా నియామకమైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్పల్లి నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ బాధ్యతలు తీసుకోవడం జరిగింది

📅 01 Dec 2025 ⏱️ 5:55 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్తెలంగాణ నిజాంబాద్ జిల్లా

కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ భవన్ నందు బాధ్యతలు తీసుకోవడం జరిగిందిఅనంతరం లక్ష్మీ కళ్యాణ మండపం నందు ప్రమాణ స్వీకార సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ,,రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ,వివిధ రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ లు,జిల్లా చైర్మన్లు,నియోజకవర్గ బాధ్యులు పాల్గొన్నారుఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూకాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు లభించడం ఎంతో అపూర్వ అవకాశాము పార్టీకి కష్టపడ్డ వారికి పదవులు తప్పకుండా వస్తాయిపదవులు ఆశించి రాని వాళ్ళుకుభవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తాంపార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు పార్టీ సిద్ధాంతాలను, విలువలను, ఆశయాలను గౌరవిస్తూ, జిల్లాలో పట్టణంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలి జిల్లాలోని ప్రతి కార్యకర్తను కలుపుకొని పోతు. వారి సలహాలు, సూచనలు తీసుకుంటాను. పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలి జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలి.అందరినీ కలుపుకొని అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీని జిల్లాలో మరింత ముందుకు తీసుకువెళ్లాలి ఎల్లవేళలా మా సహకారం మీకు ఉంటది అన్నారు

Scroll to Top