PS Telugu News
Epaper

నూతన రేషన్ షాప్ ని ప్రారంభించిన బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్

📅 01 Apr 2026 ⏱️ 2:39 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని భామిని గ్రామంలో నూతన రేషన్ షాప్ ని ముఖ్యఅతిథిగా వెళ్లి ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భామిని గ్రామంలోని రేషన్ షాప్ ని ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఏప్రిల్ మే జూన్ నెలలో బియ్యాన్ని పంపడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధనవంతులే కాకుండా బీద బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సన్నబియాన్ని తినాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా రేషన్ షాపు ద్వారా సన్నబియ్యాన్ని పంపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ భాయ్ రాజన్న , గ్రామ పంచాయతీ సర్పంచ్. గణేష్ , ఉప సర్పంచ్ గంగాధర్, వార్డ్ సభ్యులు, మాజీ సర్పంచ్ గంగాధర్, గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top