నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
ప్రత్యేక పోలీసు బృందాల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు
డీజే, సౌండ్ సిస్టంలకు అనుమతి లేదు
టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ
పయనించే సూర్యుడు డిసెంబర్ 31( పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఐ బత్తుల సత్యనారాయణ అన్నారు. నూతన సంవత్సర వేడుకల నిబంధనలకు సంబంధించి బుధవారం ఆయన ప్రకటనను విడుదల చేశారు. మద్యం మత్తులో రోడ్లపై వేగంగా ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్కెస్ట్రా, సౌండ్ సిస్టం, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజే లను ఆర్కెస్ట్రాలను సౌండ్ సిస్టంలను ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి టేకులపల్లి పరిధిలోని 3 సర్కిళ్లలో టేకులపల్లి, బోడు, ఆళ్లపల్లి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ప్రత్యేక పోలీస్ బృందాల తో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగటం నిషేధించామన్నారు. మైనర్లు, యువకులు బైకు రైడింగులు చేసి ప్రమాదాలకు కారణం కావద్దని సూచించారు. మైనర్లకు బైకులు ఇచ్చే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో టేకులపల్లి ఎస్ ఐ ఏ.రాజేందర్, బోడు ఎస్ఐ పి. శ్రీనివాసరెడ్డి, ఆలపల్లి ఎస్సై సోమేశ్వర్ పాల్గొన్నారు.