PS Telugu News
Epaper

నేటి నుండి గోడుగుపల్లిలో అంగడి బజార్ ప్రారంభం

📅 25 Feb 2026 ⏱️ 2:22 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పాల్గొననున్న సర్పంచ్ మద్దెల వనజ స్వామి ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులు

“(పయనించే సూర్యుడు ఫిబ్రవరి 24 రాజేష్)దౌల్తాబాద్, ఫిబ్రవరి

24:గ్రామీణ ప్రాంత ప్రజలకు తాజా కూరగాయలు అందుబాటులో ఉండేలా గోడుగుపల్లి గ్రామంలో అంగడి బజార్ ఏర్పాటు చేయనున్నట్లు గ్రామ సర్పంచ్ మద్దెల వనజ స్వామి తెలిపారు. ఈ బజార్‌ను ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం నుంచి ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగడి బజార్ ఏర్పాటు గ్రామాభివృద్ధి దిశగా ఇది మరో ముందడుగుగా భావిస్తున్నామని గ్రామ ప్రజలు ఇప్పటివరకు కూరగాయల కోసం సమీప పట్టణాలకు వెళ్లాల్సి వస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలోనే ప్రతీ బుధవారం అంగడి బజార్ నిర్వహించాలని నిర్ణయించామని. రైతులు నేరుగా తమ పంటలను తీసుకువచ్చి విక్రయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఈ బజార్ ద్వారా గ్రామ ప్రజలకు తాజా కూరగాయలు సరసమైన ధరలకు లభించడంతో పాటు, రైతులకు మధ్యవర్తుల సమస్య లేకుండా ప్రత్యక్షంగా విక్రయించే అవకాశం లభించనుందన్నారు. స్థానిక రైతులు తమ పంటలకు తగిన ధర పొందాలన్నారు.అంగడి బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు హాజరవుతారని తెలిపారు..

Scroll to Top