PS Telugu News
Epaper

నేడు ఇల్లందులో జరిగే తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి.

📅 02 Sep 2025 ⏱️ 7:02 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

సీ.ఐ.టీ.యూ జిల్లా అధ్యక్షులు కె. బ్రహ్మాచారీ

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 02 (పొనకంటి ఉపేందర్ రావు)

ఇల్లందు:తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభలు సెప్టెంబర్ 4న ఇల్లందు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ నందు ఐత ఫంక్షన్ హాల్ లో ప్రారంభం అవుతుందని ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పీ జయలక్ష్మి , సీటు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ జే రమేష్, ఆశా నేతలు ఎంవీ అప్పారావు,ధనలక్ష్మి లు పాల్గొని మాట్లాడతారని. ఆశా వర్కర్ ల సమస్యలపై చర్చించి భవిష్యత్ పోరాట కార్యక్రమాల రూపకల్పన చేయనున్నట్లు వారు తెలిపారు.ఈ మహసభలో ఆశ వర్కర్స్ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలనీ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె. బ్రహ్మాచారీ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి, మండల కన్వీనర్ తాళ్లూరి కృష్ణ, ఆశ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు, కిన్నెరా మల్లేశ్వరి, చీమల రమణ, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top