NTR జిల్లా:
తిరువూరు మండలం లక్ష్మీపురం MPUP పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం. పయనించే సూర్యుడు జనవరి 24 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ. స్వాతంత్ర్య సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకులు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఉపాద్యాయులు, విద్యార్థులు పూల మాల వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా నేతాజీ ధైర్య సాహసాలను, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిని గడ గడ లాడించిన విధానాన్ని ఉపాద్యాయులు విద్యార్థుల కు వివరించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం.హరికృష్ణ, ఉపాద్యాయులు సుజాత కుమారి,పద్మలత, లక్ష్మీ శ్యామల తదితరులు పాల్గొన్నారు.