నేనే రాజు నేనే మంత్రి.. నేను చెప్పిందే వేదం..
పయనించే సూర్యుడు డిసెంబర్ 8(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నది కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న స్పందించి ని అధికారులు సొమ్ము లేక ఆరోగ్యం బాగాలేక ప్రభుత్వ ఆసుపత్రి కి వస్తే ఇంత నీచంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఆసు పత్రి ఉద్యోగుల తంతు నేనే రాజు నేనే మంత్రి నేను చెప్పిందే వేదం
అంటున్న వెంకటరమణ అనే డేటా ఆపరేటర్…సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తీరు ఇలా ఉన్నది ఈ వైద్యశాలలో డాక్టర్లు మరియు ఇతర సిబ్బంది సైతం సమయా నికి వచ్చేస్తూన్నా.. సమయానికి రాకుండా ఆలస్యంగా వస్తున్న ఈ ఆపరేటర్ వృద్ధుల మీద కసురుకోవడం ఎందుకయ్యా ఆలస్యంగా నువ్వు వచ్చిందానికి మా మీద అరుస్తున్నావు అంటే పళ్ళు తోముకొని పరిగెత్తుకుంటూ వచ్చి నీకోసం సేవ చేసే వాళ్ళము మేము అనుకుం టున్నావా అని హేళన గా మాట్లాడుతూన్నాడు ఆధార్ కార్డు ఎంటర్ చేయనిదే ఈ వైద్యశాలలో బ్లడ్ రిపోర్ట్ ఇవ్వరు బ్లడ్ రిపోర్ట్ చూడనిదే డాక్టర్లు వైద్యం చేయరు డాక్టర్లు వైద్యం చేసి మెడిసిన్స్ రాసిస్తే ఈ ఆధార్ నెంబర్ డేటాలో ఎంట్రీ చేయకపోతే అక్కడ మెడిసిన్స్ ఇవ్వరు మొత్తానికి డేటాలో ఆధార్ ఎంటర్ చేయండి ఏ పని జరగదు అనే సిస్టంలోకి ప్రభుత్వ ఆసుపత్రి వచ్చి ఉన్నది అలాంటప్పుడు ఆ డేటా ఎంట్రీ చేసే వర్క్ మరి అటువంటి వ్యక్తి సహృదయంతో స్నేహభావంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఈ వ్యక్తి పనిచేయడానికి వచ్చేది ఆలస్యంగా వచ్చిన తరువాత పెద్ద మొత్తంలో రద్దీ చేరిపోయిన రోగుల మీద దురుసుగా ప్రవర్తి స్తూండడం వృద్ధ రోగులకు చాలా బాధ కలిగిస్తున్నది ఇతనిపై సరైన చర్యలు అధికారులు తీసుకోవాలని పుర ప్రజలు కోరుకుంటున్నారు అలాగే తమిళనాడు తరహాలో ఒక్కసారి డేటా కార్డు ఇచ్చేస్తే ఇటువంటి అవసరాలు ఉండవు కదా ప్రతి రోగి చేతిలో వచ్చేటప్పుడు ఆధార్ కార్డుతో రావాలి అనే విధానం ఉన్నప్పుడు డేటా ఎంట్రీ చేసే సరైన ఉద్యోగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రోగులను మానవతాదుకృతంతో చూసి పంపవలసినది వైద్యశాల యొక్క ఆలోచనగా ఉండడం ఇటు రోగులకు అటు ప్రభుత్వా నికి మంచి పేరు వస్తుంది కదా సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని త్వర ప్రజలు కోరుకుంటున్నారు