PS Telugu News
Epaper

నేరెళ్ల పాఠశాలలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం — డాక్టర్ చంద్రికా రెడ్డి

📅 25 Oct 2025 ⏱️ 7:00 PM 📝 Uncategorized
Listen to this article

పయనించే సూర్యుడు, అక్టోబర్ 25( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్

నేరెళ్ల: రెసిడెన్షియల్ నేరెళ్ల ప్రాథమిక పాఠశాలలో వైద్యాధికారి డాక్టర్ చంద్రికా రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాధా, సూపర్వైసర్ రాంబాయి పాల్గొన్నారు.డాక్టర్ చంద్రికా రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు ప్రస్తుత సీజన్‌లో విస్తరిస్తున్న వైరల్ ఫీవర్లపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైరల్ ఫీవర్లకు భయపడనవసరం లేదని, కానీ తీవ్రమైన లక్షణాలు కనబడితే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని చెప్పారు.అదేవిధంగా విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులు, చేపలు తినడం అలవాటు చేసుకోవాలని సూచించారు. అయోడిన్ లోపం వల్ల గయాటర్ అనే వ్యాధి వస్తుందని, దాని ప్రారంభంలో మెడ వద్ద ఊబ్బుగా కనిపిస్తుందని వివరించారు.టాబకో ఫ్రీ యూత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పొగాకు, సిగరెట్, గుట్కా, తంబాకు వంటి పదార్థాలను వాడకూడదని విజ్ఞప్తి చేశారు. పొగాకు వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, కాలేయ వ్యాధులు, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయని హెచ్చర

Scroll to Top