నేషనల్ కళాశాలలో కియా మోటార్స్ కంపెనీ క్యాంపస్ సెలక్షన్లు.
పయనించే సూర్యుడు, జనవరి 16, నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల పట్టణంలో నేషనల్ కళాశాల నందు కియా మోటార్స్ కంపెనీ పెనుగొండ వారు క్యాంపస్ సెలక్షన్లు నిర్వహించడం జరిగింది. 20 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నేషనల్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్.ఇంతియాజ్ అహ్మద్ హాజరై మాట్లాడుతూ ముందుగా నంద్యాల జిల్లా పట్టణ ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కియా మోటార్స్ వారు నిర్వహించిన ఇంటర్వ్యూలకు నిరుద్యోగ యువత 27 మంది హజరు కాగ 20 మంది ఉద్యోగులుగా ఎన్నిక చేయడం జరిగిందని తెలిపారు.కియా మోటార్స్ కంపెనీ వారు నేషనల్ కళాశాల విద్యార్థులకు మరియు నంద్యాల పట్టణంలోని అన్ని కళాశాలల విద్యార్థులకు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఇంటర్వ్యూలను నేషనల్ కళాశాలలో నిర్వహించారు. పదవ తరగతి నుండి ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగ యువతకు పెనుగొండ వద్ద ఉన్న కియా మోటార్స్ కంపెనీలో పనిచేయుటకు వారి వారి విద్యార్హతకు తగిన ఉద్యోగానికి కియా మోటార్స్ కంపెనీ వారు అవకాశం కల్పిస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నేషనల్ కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ ను సంప్రదించాలని ఈ సదవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని నేషనల్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు.