PS Telugu News
Epaper

న్యాయవాదుల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా…

📅 11 Apr 2026 ⏱️ 7:14 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి

ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన న్యాయవాద బార్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు

( పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

న్యాయవాదుల అభివృద్ధికి, న్యాయవాదుల సంక్షేమానికి, పట్టణ న్యాయవాద బార్ అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని నవీన్ రెడ్డి అన్నారు. న్యాయవాద బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన బీరంగూడ జగన్మోహన్ రెడ్డి నూతన కమిటీ సభ్యులతో కలిసి ఈరోజు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డిని శాలువాలతో సన్మానించి సత్కరించారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కూడా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీరంగూడ జగన్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శి శంకర్, పెబ్బే శ్రీశైలం,విజయ్ కుమార్ గౌడ్,గంజాయి నర్సింలు, నరేష్ కుమార్, పోమాల్ పల్లి సర్పంచ్ స్వప్న భూపాల్ రెడ్డి,మాజీ సర్పంచ్ తాండ్ర విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top