పంచాయతీ ఎన్నికలపై ప్రజలకు అవగాహన: ఏసీపీ రూరల్
పయనించే సూర్యుడు నవంబర్ 29 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా పోలీసులకు సహకరించాలని ఖమ్మం రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి తెలిపారు.పోలీస్ కమిషనర్ సునీల్ ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ముదిగొండ గ్రామ ప్రజలతో మమేకమై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ అండగా ఉంటుందని, ప్రజా రక్షణ, భద్రత పోలీసుల లక్ష్యమని అన్నారు. గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు.