PS Telugu News
Epaper

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి…

📅 11 Feb 2026 ⏱️ 6:54 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే ఫిబ్రవరి 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి కొత్తపేట మండలం వానపల్లి గ్రామం లో 175 బూత్ బిజెపి కమిటీ ఆధ్వర్యంలో బిజెపి సీనియర్ నాయకులు గొలకోటి వెంకటేశ్వరరావు నివాసం లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర యువ మోర్చా నాయకులు పాలూరి జయ ప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. ముందుగా దీన్ దయాల్ చిత్రపటానికి బిజెపి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జయ ప్రకాష్ మాట్లాడుతూ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జనసంగ్ మరియు ప్రస్తుత బిజెపి పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు. ఆయన ప్రవచించిన ఏకాత్మ మానవతావాదం అంటే సంఘర్షణ కాదు, సమన్వయానికి మార్గదర్శకం అని ఆయన ఈ సిద్ధాంతం ద్వారా భారతీయ సంస్కృతి కి అనుగుణం అయిన రాజకీయ, ఆర్థిక విధానాలు ప్రతిపాదించారు. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా, జర్నలిస్ట్ గా మరియు పేద ప్రజల అభ్యునతి కి కృషి చేశారు అని జేపీ తెలిపారు.ఆయన మరణం మాత్రం అనుమానస్పదం అన్నారు. ఈ కార్యక్రమం లో బిజెపి సీనియర్ నాయకులు బమిడిపాటి లక్ష్మి నారాయణ, మండల ఉపాధ్యక్షులు బల్ల రాజు, మండల కార్యదర్శి ఇళ్ల పల్లంశెట్టి, యువ మోర్చా మండల అధ్యక్షులు వలపశెట్టి కిరణ్, రంకిరెడ్డి సందీప్, యర్ర పల్లంరాజు, కంచుస్తంభం సతీష్, గెడ్డం ప్రసాద్, వాసంశెట్టి రాజు, ధర్నాల శేఖర్, వాసంశెట్టి సత్యనారాయణ
తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top