పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యకర్తలకు ప్రశిక్షణ కార్యక్రమం
పయ నించే సూర్యుడు మార్చి 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
సఖినేటిపల్లి మండలం, అంతర్వేది దేవస్థానం గ్రామంలో త్రిబుల్ ఆర్ కళ్యాణ మండపంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పోతురాజు సురేష్ అధ్యక్షతన
పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యకర్తలకు ప్రశిక్షణ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా బిజెపి అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు నేషనల్ కౌన్సిల్ మెంబర్ మానేపల్లి అయ్యాజీవేమ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రశిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందని పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్తకు శిక్షణను అందించే అతిపెద్ద కార్యక్రమము అన్నారు. బిజెపి చరిత్ర , సైదాంతిక పునాది, కార్యాచరణ విధానం, బూత్ మేనేజ్మెంట్, కార్యవిస్తార్, అంత్యోదయ ద్వారా సంతృప్తి తదితర విధానాలను శిక్షణలో అందించామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్, జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మాలే శ్రీనివాస నగేష్, నాయకులు చంపాటి శివరామకృష్ణంరాజు, బోనం నాయుడు, ఉద్దర్రాజు రామకృష్ణంరాజు, రావూరి బాబ్జి, పోతురాజు నాగరాజు, ఇందుకూరు సుబ్బరాజు, పట్టపు సూర్యప్రకాశరావు, ఎనుముల సుబ్బారావు, చెల్లింగి త్రినాథ్, అడబాల రాంబాబు, చీకరుమిల్లి శ్రీనివాసరావు, షంనుస్ సాదిక్, విళ్ళ దొరబాబు, బాబీ మాస్టార్, కొల్లా బత్తుల నాగభూషణం, బల్ల సత్యనారాయణ, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
