
ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
ఎల్లారెడ్డి గూడలో మాగంటి సునీతమ్మ గెలుపుకోసం ఎన్నికల ప్రచారం
( పయనించే సూర్యుడు నవంబర్ 1 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతమ్మకు ఓటు వేసి గెలిపిస్తే అన్ని పథకాలను రద్దు చేస్తాం అని ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ లోని రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జూబ్లీహిల్స్ ప్రజలు గమనిస్తున్నారని ఓటు వేయకుంటే పథకాలను రద్ద చేస్తారా? ఇదేనా ఒక ముఖ్యమంత్రి ఇచ్చే సందేశం అని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార సందర్బంగా అన్నారు.సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డిగూడలో మాగంటి సునీతమ్మ గెలుపు కొరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కు ఓటు వేయకుంటే పథకాలను రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి సింద్ధంగా ఉన్నామని జూబ్లీహిల్స్ ప్రజలు తెలుపుతున్నారని అన్నారు.ఈ ప్రచారంలో మాజీ కార్పోరేటర్ మహేష్ యాదవ్, భూత్ ఇన్చార్జులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
