పరిశుభ్రత,నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ హోటల్ యమ్మి ముందుకు సాగాలి

July 24, 2026 | సినిమా వార్తలు

ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

యమ్మీ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

( పయనించే సూర్యుడు జూలై 25 షాద్ నగర్ ఇంచార్జ్ నరేందర్ నాయక్ )పోలేపల్లి వద్ద మహబూబ్ నగర్ రోడ్డులో నూతనంగా ప్రశాంత్ ఏర్పాటు చేసిన హోటల్ యమ్మి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.అనంతరం హోటల్‌ను పరిశీలించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ,హోటల్ యమ్మి పరిశుభ్రత,నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ వినియోగ దారులకు రుచికరమైన ఆహారాన్ని అందించాలని ఆకాంక్షించారు. మంచి సేవలు,నాణ్యమైన ఆహారం అందిస్తే ప్రజల ఆదరణ తప్పకుండా లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో యాజమాన్యం బీఆర్ఎస్ యువనాయకులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper