PS Telugu News
Epaper

పరిసరాలు పరిశుభ్రతంగా ఉంచుకోవాలి

📅 28 Nov 2025 ⏱️ 6:36 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 28 శర్వాస్ వలి మండల రిపోర్టర్ యాడికి

మండలంలోని రాయల చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దేవరాజన్ ,డాక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసులు ప్రతి శుక్రవారం లో భాగంగా భోగాల కట్ట గ్రామంలో ప్రజలకు డ్రై డే , ఫ్రైడే నిర్వహించారు. గ్రామంలోని లక్ష్మీదేవి బోదకాలు పేషెంట్ ను ఆమె కాలును ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు గ్రామంలో 104 వచ్చిన పేషెంట్లకు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు అనంతరం ఆరోగ్య కేంద్రం రాయలచెరువు ల్యాబ్ ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికి డెంగు మలేరియా చికెన్ గునియా టైఫాయిడ్ మొదలు గు రక్త పరీక్షలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ షబ్బీర్ అహ్మద్ ఏఎన్ఎం శివగంగా ఆశ కార్యకర్త వసంత 104 సిబ్బంది అనిల్ బాలాజీ నాయుడు పాల్గొన్నారు

Scroll to Top