పర్యావరణ అనుమతులకు సంపూర్ణ మద్దతు తెలుపండి
{ పయనించే సూర్యుడు} {జనవరి7 మక్తల్ }
మక్తల్ – నారాయణ పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టుటకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కేంద్ర పర్యావరణ అనుమతుల కోసం ఈ నెల 8 తేదీన దామరగిద్ద తండా లో చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణ లో జిల్లా వాసులందరూ పాల్గొని పార్టీలకు అతీతంగా పర్యావరణానికి ఎలాంటి నష్టం లేదు కావున వెంటనే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేయాలని ప్రతి ఒక్కరు తమ అభిప్రాయం తెలుపాలని జల సాధన సమితి జిల్లా కో కన్వీనర్ హెచ్.నర్సింహా ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. .జిల్లా రైతులకు సాగునీరు కేవలం ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మాత్రమే సాధ్యం అని అన్నారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నారాయణ పేట జిల్లా రైతులకు సాగునీటి కష్టాలు తీర్చడం కోసం మక్తల్ – నారాయణ పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం వెంటనే పూర్తి చేయాలని కోరారు.