పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీ కార్యక్రమం విజయవంతం చేయండి యాంకే పద్మ ఎం జె పి వి సి మక్తల్ అసెంబ్లీ మహిళా విభాగం అధ్యక్షురాలు

పయనించే సూర్యుడు ఆగస్టు 11మక్తల్ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో యాంకే పద్మ ఎం జె పి వి సి మక్తల్ అసెంబ్లీ మహిళ విభాగం అధ్యక్షురాలు ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గం పరిధిలో వివిధ ప్రాంతాలను సందర్శించి విద్యార్థిని విద్యార్థినిలకు పాఠశాలలకు వెళ్లి పర్యావరణ పరిరక్షణ గురించి యాంకే పద్మ వివరించడం జరిగింది ఈనెల 30/8/2026 జరగబోయే పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస కార్యక్రమం మక్తల్ ప్రాంతంలో ఉంటుంది అని అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విద్యార్థినిలకు పిలుపునిచ్చారు అనంతరం ముడుమల హై స్కూల్ గుండెబాల్లూరు హై స్కూల్ కృష్ణ హై స్కూల్ కూన్సీ హై స్కూల్ మగానుర్ హై స్కూల్ మక్తల్ బాయ్స్ హై స్కూల్ మక్తల్ గర్ల్స్ హై స్కూల్ మరియు మక్తల్ ప్రభుత్వం హై స్కూల్ లలో పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీ కార్యక్రమం గురించి వివరించడం జరిగింది అలాగే ప్రతి పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ ప్రచార పత్రం విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో MJPVC నాయకులు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థినీయులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.