పల్లంకుర్రు పి హెచ్ సి పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం*

June 29, 2026 | తెలంగాణ

“నిండు జీవితానికి రెండు చుక్కలు”

పయినించే సూర్యుడు జూన్ 29 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) *కాట్రేనికోన మండలం పల్లంకుర్రు
ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధి పల్లంకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ప్రతి సచివాలయంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతోంది. డాక్టర్ పి నీలిమ ,బి రోజా, ఈ కార్యక్రమం పరిరక్షణలోఈ పరిధిలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల మొత్తం 1893 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయడం జరిగింది.ఈ కార్యక్రమం మొత్తం మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు.మొదటి రోజు: కేటాయించిన కేంద్రాల వద్ద చిన్నారులకు చుక్కలు వేయడంరెండవ రోజు: ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయడంమూడవ రోజు: మిగిలిపోయిన పిల్లలందరికీ 100 శాతం చుక్కలు అందేలా ఇంటింటికి వెళ్లి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడంసిబ్బంది కృషి:వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యులు పి. నీలిమ, బి. రోజా పర్యవేక్షణలో, పర్యవేక్షకులు ఐ. వైడుర్యం, ఎం. క్రాంతి కుమార్, బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేశారు.లక్ష్యం:పోలియో రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా, ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా అందరికీ పోలియో రక్షణ కవచం అందించడం

🌐 Select Language:
📰 ePaper