పల్లెలకు పారిశుద్ధ్యం,నీరు, ఆరోగ్యం..
శాసనమండలిలో మాట్లాడిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి..
పల్లెలను పట్టించుకోవాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి డిమాండ్..
పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుకు విజ్ఞప్తి
( పయనించే సూర్యుడు జనవరి 02 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
పల్లె సీమల్లో పారిశుద్ధ సమస్యలు, తాగునీటి సమస్యలు, పల్లె ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలని ఎమ్మెల్సీ నవీన్ నాగర్ కుంట నవీన్ రెడ్డి శాసనమండలిలో కోరారు. శుక్రవారం జరిగిన శాసనమండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో గత పరిస్థితులకు అనుగుణంగా పారిశుద్ధ కార్మికులను ఏర్పాటు చేశారని, కాకరమైన గ్రామాలు విస్తరించి అవసరాలు పెరిగాయని కానీ పారిశుద్ధ కార్మికుల సంఖ్య మాత్రం పెరగలేదని వివరించారు. పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని సూచించారు. అదేవిధంగా పారిశుద్ధ కార్యక్రమం కార్మికులకు కేవలం 9000 వేతనం మాత్రమే చెల్లించటం జరుగుతుందని,వారి వేతనాలను 15 వేలకు పెట్టాలని కోరారు.ఇక గ్రామపంచాయతీలలో గత అవసరాలు అనుగుణంగా అప్పటి ప్రభుత్వం మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసిందని, ప్రస్తుతం నీటి అవసరాలు పెరుగుతున్న దృశ్య దానిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇక గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా సదుపాయాలు కల్పించాలని,సిబ్బందిని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ సమస్యలను తప్పనిసరిగా పట్టించుకోవాలని ఆయన అన్నారు.