PS Telugu News
Epaper

పల్లె ప్రగతిలో సర్పంచులు పాత్ర కీలకం

📅 24 Feb 2026 ⏱️ 7:01 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

స్వర్ణ భారత్ ట్రస్టులో నిర్వహిస్తున్న నూతన సర్పంచ్ ల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

ముచ్చింతల్ గ్రామ పరిధిలో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్టులో నిర్వహిస్తున్న నూతనంగా ఎన్నికైన రంగారెడ్డి జిల్లా సర్పంచ్ ల శిక్షణ కార్యక్రమానికి షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామాల్లో అభివృద్ధి, సహృద్భావ వాతావరం సాధించడం లో సర్పంచుల పాత్ర కీలకం అని అన్నారు.ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉండి, గ్రామస్తులకు సేవ చేస్తే మంచి పేరు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్,డివిజనల్ పంచాయతీ అధికారి సాధన,మండల పంచాయతీ అధికారులు కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top