PS Telugu News
Epaper

పసిప్రాణాలతో చలగాటం స్కూల్ వ్యాన్లు

📅 08 Jan 2026 ⏱️ 1:28 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 8 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )

సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో ఎంత ఘోరంగా ఉన్నాయో ప్రైవేట్ విద్య సంస్థల నిర్వహణ అధికారుల కంటికి కనబడటం లేదా అయ్యా అధికారులు లారా అభం శుభం తెలియని పసి ప్రాణాలు స్కూల్ వెళ్లాలని నవ్వుతూ ఇంట్లో తల్లిదండ్రులకు బాయ్ అని చెప్పి బయలుదేరింది స్కూల్ బస్సును ఎక్కుతారు.ఎన్నో ఆశలు పెట్టుకుని తల్లిదండ్రులు తమ బిడ్డలకు రక్షణ మరియు గొప్ప ప్రయోజకులు చేయాలని సంకల్పంతో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తారు.అయితే ఇదే అదునుగా భావించే ప్రైవేట్ విద్యా సంస్థలు కాలం చెల్లిన వాహనాలతో పసిప్రాణాలను ఎక్కించి చెలగాటమాడుతుంటారు. అసలు విద్యా సంస్థ వ్యాన్ డ్రైవర్ ఎలాంటి నిభద్రత నియమ నిబంధనలు పాటించాలో స్కూల్ యాజమాన్యాల కైనా తెలుసా? స్థానిక స్కూల్ వ్యాన్ నడిపే డ్రైవర్ కు సైతం నిబంధనలు పాటించాలని ఆలోచన ఉంటుందా.ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్లు పిల్లలని తమ బిడ్డలుగా భావిస్తే ఇలా పసిప్రాణాలతో ఎందుకు చలగాటమాడుతారు తమ బిడ్డలు అయితే ఇలాంటి ఘోరాలు చేస్తారా విద్యాసంస్థల్లో చదివే అభం శుభం తెలియని పసిప్రాణాలు ప్రాణాలు కావా.ఎందుకింత నిర్లక్ష్యం పసిప్రాణాలను ఎక్కించుకొని సూళ్లూరుపేట మండలంలో పోలిక్రాస్ సర్కిల్ ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలిసింది అక్కడే రంగ్ రూట్లో వెళ్తున్న కొన్ని విద్యాసంస్థల బస్సులు అవే కాకుండా తడ మండలంలోని గ్రామ సమీపంలో రాంగ్ రూట్లో మితిమీరిన వేగంతో ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన స్కూల్ వ్యాను పసిబిడ్డలతో విద్యార్థులతో పయనిస్తూ ఈ చిత్రాలు కంటపడ్డాయి .పట్టణంలో జాతీయ రహదారిపై ప్రజల ప్రాణాలకోరకు రక్షణ వలయం అంటూ కొన్ని ప్రభుత్వ శాఖలు గగ్గోలు పెడుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రచురించుకుంటుంటారు.అదే శాఖకు ఇలాంటి అడ్డగోలు స్కూల్ బస్సులపై చర్యలు చేపట్టే అధికారం లేదా లేక ఇలాంటి విద్యా సంస్థలతో కుమ్మక్కయ్యే మర్మమేమైనా ఉందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అయ్యా అధికారుల్లారా మేము ఓటర్లను మా ఓట్లతో ప్రభుత్వాలు ఏర్పడతాయి స్థానిక ప్రజా ప్రతినిధులను మేమే వేడుకుంటున్నాం మీరు మా మీద కనికరం చూపి మీరు ప్రజాసేవకులైతే ఇకనైనా మాయలు మర్మాలు మానుకొని పసిప్రాణాలకు రక్షణ కల్పించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిస్తున్న స్థానికులు.

Scroll to Top