పాలకొండలో డివిజన్ స్థాయి ఆటల పోటీలు
పాలకొండ పయనించే సూర్యుడు సెప్టెంబరు 15 ప్రతినిధి జీ రమేష్.
పాలకొండ నగరంలో గల జడ్పీహెచ్ఎస్ స్కూల్లో పాలకొండ పాత డివిజన్ స్థాయిలో 13 మండలాల్లో గల విద్యార్థిని విద్యార్థులకు హై స్కూల్ స్థాయిలో ఆటలు పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమమును పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ప్రారంభిస్తూ ఆటలు అనేవి మానసిక ఉల్లాసానికి ఉపయోగపడేలా ఉండాలని దీనిలో పగలు ప్రతీకారాలు ఉండకూడదని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మంచి ఆటలాడి మీ స్కూల్ లకు ఈ డివిజనకు పేరు తీసుకురావాలని విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాలకొండ శాసనసభ్యులతో పాటు ముఖ్య నాయకులు కార్యకర్తలు, విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

