PS Telugu News
Epaper

పితానికి వైసీపీ అధినేత జగన్ పరామర్శ..

📅 23 Feb 2026 ⏱️ 6:22 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 23 ముమ్మడివరం ప్రతినిధి

ముమ్మిడివరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ( సిఇసి) శ్రీ పితాని బాలకృష్ణ సతీమణి సరస్వతి గారు కి హైదరాబాద్ లో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స చేయించుకొని ప్రస్తుతం వైద్యుల సూచనలతో అక్కడే (హైదరాబాద్) లోవుండి విశ్రాంతి తీసుకుంటున్నారు. పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం శ్రీ పితాని బాలకృష్ణను ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన సతీమణి సరస్వతి గారిని కూడా జగన్ ఫోన్ ద్వారా పరామర్శించి..ఆరోగ్యంపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని సరస్వతి గారికి సూచించారు. అలాగే బాలకృష్ణకు ధైర్యం చెప్పారు. దేవుడి దయ వలన అంతా మంచి జరుగుతుందని ఆయన ధైర్యం చెప్పారు. ఆపరేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.

Scroll to Top